![]() |
![]() |

ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడి మరణించే వారి సంఖ్య పెరుగుతుంది. పలువురు సినిమా వాళ్ళు కూడా చనిపోతున్న విషయం చూస్తూనే ఉన్నాం. కాకపోతే కొంత మంది క్యాన్సర్ ని ముందుగానే గుర్తించి సరైన ట్రీట్ మెంట్ తీసుకోవడం వలన ప్రాణాలు కాపాడుకోగలుతున్నారు. గౌతమి, మనీషా కొయిరాలా, హంసా నందిని వంటి తారలు కేసీర్ ని ముందుగానే గుర్తించడం వలన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కానీ ఒక నటి మాత్రం తన ప్రాణాలని కాపాడుకోలేక పోయింది.
విజయకుమారి(vijayakumari)భారతీయ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలు, సీరియల్స్‌లో సహాయ నటిగా నటించింది. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతుంది. అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ ని కూడా మూడు సంవత్సరాలుగా తీసుకుంటూ మెడిసిన్స్ వాడుతుంది.కానీ వ్యాధి ముదరడంతో తనువు చాలించింది. క్యాన్సర్ స్టేజ్ మూడో దశలో ఉంది తమినాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన విజయ కుమారి చెన్నైలోని వలసరవాకంలో నివాసం ఉంటుంది. తన చికిత్సకి కావాల్సిన ఆర్ధిక సహాయం కోసం అనేక మందిని కోరింది. అయితే చికిత్స అందక ఈరోజు ఉదయం మృతి చెందింది. ఆమె మృతి సినీ పరిశ్రమని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె భవతరణి కూడా చిన్న వయసులోనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించింది.
![]() |
![]() |