![]() |
![]() |

పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. అందుకే ఆయన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి బడా కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఇప్పటికే పలు కంపెనీలకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో జెప్టో కూడా చేరింది. కానీ, రీసెంట్ గా రిలీజ్ అయిన యాడ్ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని దారుణంగా నిరాశపరిచింది.
స్టార్ హీరోలు యాడ్స్ విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటున్నారు. యాడ్స్ కూడా తమ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉండేలా చూసుకుంటున్నారు. యాడ్ కాన్సెప్ట్ క్రియేటివ్ గా ఉండేలా చూసుకోవడంతో పాటు, దానిని డైరెక్ట్ చేయడానికి స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపుతున్నారు. అయితే జెప్టో యాడ్ విషయంలో అలాంటి కేర్ తీసుకున్నట్టుగా కనిపించట్లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాయికి తగ్గట్టుగా కాన్సెప్ట్ లేదని.. లుక్స్, కెమెరా యాంగిల్స్ కూడా సరిగా లేవని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా బాలేకపోతే ఫ్యాన్స్ నిరాశ చెందటం సహజం. కానీ, ఒక యాడ్ చూసి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారంటే.. స్టార్ హీరోలు తాము చేసే యాడ్స్ విషయంలోనూ కేర్ తీసుకోవాల్సిన అవసరముంది.
![]() |
![]() |