![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఈ నెల 30 న 'శ్రీనివాస మంగాపురం' తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. ఆర్ ఎక్స్ 100 , మంగళవారం చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు కావడం, అగ్ర నిర్మాత వైజయంతీ మూవీస్ అశ్విని దత్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉండటం, ప్రచార చిత్రాలు బాగుండటంతో శ్రీనివాస మంగాపురం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ప్రమోషన్స్ లో భాగం తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయ కృష్ణ మాట్లాడుతు 'శ్రీనివాస మంగాపురం' ని ప్రత్యక్షంగా చూసిన బాబాయి మహేష్ బాబు నా నటన, యాక్షన్ ఎపిసోడ్లు, పాటలు చూసి ఎంతో సంతోషపడటంతో పాటు ,నేను ట్రాన్స్‌ఫర్మేషన్ చెందిన విధానం 100 శాతం అద్భుతంగా ఉందంటూ అభినందించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లోనే బాబాయ్ 'రాజకుమారుడు'తో కెరీర్ ప్రారంభించగా,నేను కూడా అదే సంస్థ ద్వారా పరిచయం కావడం ఒక అరుదైన డివైన్ కనెక్షన్.
Also read: భారీ ధరకి ఆ ఏరియాలో ప్లాట్ కొన్న నయన్.. రజనీకాంత్ ని దాటిందా!
సినిమా రంగానికి రాకముందే మార్షల్ ఆర్ట్స్ మరియు ఫిజికల్ ట్రైనింగ్ పొందటంతో యాక్షన్ సన్నివేశాల్లో నటించడం ఎంతో సులువైంది. టీజర్‌లో నన్ను చూసి మహేష్ బాబు పోలికలు గుర్తుకు తెచ్చుకున్నప్పటికీ, థియేటర్‌లో సినిమా మొదలైన 5 నిమిషాల్లోనే ప్రేక్షకులు కేవలం శ్రీను పాత్రలోనే మమేకమవుతారు. నా ఫస్ట్ ఇంపార్టెన్స్ కథ.. బాబాయ్ సలహా మేరకు అమెరికాలో నటన విషయంలో మెళుకువలన్నీ నేర్చుకున్నాను. డాన్స్, ఫైట్స్ మాత్రం హైదరాబాద్ లో నేర్చుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ లో అయితే పది సంవత్సరాల క్రితం నుంచే ప్రావిణ్యం ఉంది. ఘట్టమనేని అభిమానుల నుంచి లభిస్తున్న 100 శాతం మద్దతుతో, ప్రేక్షకుల మద్దతుతో 'శ్రీనివాస మంగాపురం' సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసాడు.
JayaKrishna, SrinivasaMangapuram, Mahesh Babu
![]() |
![]() |