![]() |
![]() |

శ్రీదేవి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నజాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తుంది. లేటెస్ట్ గా ఈ మూవీలోని కొన్ని పిక్స్ ఇటీవలే వచ్చి జాన్వీ అచ్చం తన తల్లిలా ఉందనే కితాబుని దక్కించుకుంది. అలాగే దేవర సినిమాతో జాన్వీ అగ్ర హీరోయిన్ గా ఎదగడం ఖాయమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే రామ్ చరణ్ పక్కన కూడా జాన్వీ నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైం లో జాన్వీ గురించి వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
జాన్వీ కపూర్ త్వరలో శిఖర్ పహారియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. శిఖర్ అండ్ జాన్వీ ఇద్దరు కూడా చిన్నప్పటినుంచి స్నేహితులు. అలాగే ఇద్దరు కలిసి చదువుకున్నారు కూడా. మొదట వీళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉండేది.క్రమంగా ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది.ఇద్దరు కలిసి షికార్లు కూడా చేస్తు చాలా చోట్ల మీడియాకి కూడా కనపడ్డారు. అలాగే ఎన్నో దేవాలయాలని కూడా సందర్శించారు. ఇప్పుడు ఈ ఇద్దరి పెళ్ళికి ఇరువైపు పెద్దలు కూడా ఒప్పుకున్నారని వచ్చే సంవత్సరమే ఇద్దరి వివాహం ఉంటుందని అంటున్నారు.

జాన్వీ పెళ్లి విషయం పై వస్తున్న వార్తలని విన్న కొంత మంది అయితే జాన్వీ సినిమా కెరీర్ ఇప్పుడిప్పుడే అత్యున్నత స్థాయికి చేరబోతుందని ఈ సమయంలో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. కాకపోతే జాన్వీ పెళ్లి విషయంలో ఇరు వైపుల నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. జాన్వీ ప్రస్తుతం దేవర షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా.
![]() |
![]() |