![]() |
![]() |
మంచు మనోజ్ నటించిన సినిమా రిలీజ్ అవ్వక చాలా కాలమైంది. ఆమధ్య అహంబ్రహ్మస్మి అనే చిత్రాన్ని ప్రారంభించిన మనోజ్ కొంత షూటింగ్ జరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టారని తెలుస్తోంది. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో స్టార్ట్ చేసిన వాట్ ద ఫిష్ అనే సినిమా నిర్మాణ దశలో ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఓటీటీలో ఓ సరికొత్త టాక్ షో స్టార్ట్ చెయ్యబోతున్నాడు. ఉస్తాద్ అనే టాక్ షో ద్వారా మనోజ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను తెలిపేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు మనోజ్. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా, సరదాగా సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ప్రెస్‌మీట్‌లో చిన్న గడబిడ జరిగింది. ఒక విలేకరి ప్రశ్న అడుగుతున్న తరుణంలోనే అతని దగ్గర నుంచి మైక్ తీసుకున్నారు పీఆర్‌ఓ. దీంతో ప్రెస్‌మీట్‌లో చిన్న గొడవ జరిగింది. తను మంచు విష్ణుతో గొడవేంటి అనే ప్రశ్నను అడిగిన వెంటనే మైక్ లాక్కోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రశ్న అడక్కుండా కావాలనే పీఆర్‌ఓ మైక్ లాక్కున్నారని ఆరోపించారు.
నిజానికి అక్కడ జరిగింది వేరు. ఎక్కువ మంది విలేకరులు సమావేశానికి రావడంతో అందరికీ ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వాలన్న సదుద్ధేశంతోనే మైక్ తీసుకోవడం జరిగిందని పీఆర్‌ఓలు వివరించారు. ఒక విలేకరి మనోజ్‌ను వరుసగా 3 ప్రశ్నలు అడిగిన తరువాత మళ్ళీ వెంటనే విష్ణుతో జరిగిన గొడవ గురించి 4వ ప్రశ్నను అడిగారు. ఈ క్రమంలో పక్కన ఉన్న తోటి జర్నలిస్టులు కూడా మరొక ప్రశ్న అడగాలని ఎదురుచూస్తూ ఉండడంతో పీఆర్‌ఓలు వారికి మైక్ ఇవ్వాలని సున్నితంగానే కోరారు. అయితే ఆ ప్రశ్న ఆడిగేటప్పుడే కావాలని మైక్ లాక్కుంటున్నారు అని కొంత అసంతృప్తి వ్యక్తం చేయగా అప్పటికి మనోజ్ ఆ గొడవ గురించి ఒక సమాధానం అయితే ఇచ్చారు. నిజానికి అక్కడ ప్రశ్నకు మైక్ లాక్కోవడానికి సంబంధం అయితే లేదు. ఇక ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మనోజ్ ఆ విషయం గురించి తన అన్ననే అడగాలని అన్నట్లుగా కూల్ గా ఆన్సర్ ఇచ్చి అక్కడితో క్లోజ్ చేశారు.
![]() |
![]() |