![]() |
![]() |

-థియేటర్స్ లో తన హవా కొనసాగిస్తున్న చెన్నై లవ్ స్టోరీ
-నివి గా గౌరీ ప్రియ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మ్ చేసిందనే కితాబు
-అచ్చ తెలుగు నటి అయిన గౌరీ ప్రియ ఇండస్ట్రీ ని శాసించబోతుందా!
నటనకి గౌరవం తెచ్చే నటీమణులు అరుదుగా వస్తుంటారు. ఇప్పుడు ఆ అరుదైన నటీమణి జాబితాలో శ్రీ గౌరీ ప్రియ(Sri Gouri Priya)చేరిందని 'చెన్నైలవ్ స్టోరీ'చూసిన ప్రేక్షకులు ముక్త కంఠంతో చెప్తున్నారు. నిజానికి 'నివి' అనే ఆధునిక యువతి క్యారక్టర్ లో గౌరీ ప్రియ ప్రదరించిన పెర్ఫార్మ్ అంత ఈజీ కాదు. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం పోషించిన స్టీవెన్ క్యారక్టర్ చనిపోయినప్పుడు ఫుల్ గా ఆల్కహాల్ తీసుకొని, స్టీవెన్ సమాధి దగ్గరకి వెళ్లి నా జీవితంలోకి ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయావు అని ఏడుస్తూ ఆమె చేసే పెర్ఫార్మ్ ఒక లెవల్ అని చెప్పవచ్చు. ఎంతో అనుభవమున్న నటీమణుల వల్లనే అది సాధ్యమవుతుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా శ్రీ గౌరీ ప్రియ పేరు మారుమోగిపోతుంది.
గౌరీ ప్రియ ప్రయాణం ఒక గాయనిగా ప్రారంభమైంది. చిన్నతనంలోనే తన గాత్రంతో ఆకట్టుకున్న ఆమె, ప్రముఖ సంగీత కార్యక్రమం 'బోల్ బేబీ బోల్' సీజన్ 2లో రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సీజన్ 3లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జెమిని టీవీలో కొంతకాలం యాంకర్‌గా పనిచేసిన అనంతరం సెల్యులాయిడ్ వైపు అడుగులు వేసి 2016 లో వచ్చిన 'నిర్మలా కాన్వెంట్' తో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి, 'మనలో ఒకడు', 'ఫిదా' , లవ్ స్టోరీ, శ్రీకారం వంటి చిత్రాల్లో స్మాల్ క్యారెక్టర్స్ లో కనిపించింది. యూట్యూబ్ వెబ్ సిరీస్ 'మోడర్న్ లవ్ చెన్నై' అనే అంతర్జాతీయ ఓటీటీ సిరీస్‌లోని 'లాలాగుండా బొమ్మైగల్' ఎపిసోడ్ ద్వారా తనలోని అసలైన నటిని పరిచయం చేసింది. ఆ తర్వాత తమిళంలో వచ్చిన 'లవర్' చిత్రంలో నటించి, విమర్శకుల నీరాజనాలు పొందడంతో పాటు మ్యాడ్ మూవీతో క్రేజ్ సంపాదించింది. తమిళంలో చేసిన ట్రూ లవర్, హ్యాపీ రాజ్ వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు చెన్నై లవర్ స్టోరీ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ కైవసం చేసుకుంది.
Also read: ఏంటి తంబీ ఈ కలెక్షన్స్.. చెన్నై లవ్ స్టోరీ మూడు రోజుల పరిస్థితి ఇదే!
సినీ విశ్లేషకులు సైతం గౌరీ ప్రియ గురించి మాట్లాడుతూ తన కట్ అవుట్ చూసి ప్రేక్షకులు థియేటర్స్ వెళ్లేంత క్రేజ్ పొందినట్లే అని చెప్తున్నారు. గౌరీ ప్రియ అచ్చ తెలుగు అమ్మాయి. స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ. చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్‌లో సైతం గౌరీ ప్రియ మూవీ సాధించిన విజయం, తన రోల్ కి వస్తున్న స్పందన చూసి కన్నీళ్లు పెట్టుకుంది.
Sri Gouri Priya, Chennai Love Story< kiran Abbavaram
![]() |
![]() |