![]() |
![]() |

-సెన్సార్ ఎందుకు అడ్డు వచ్చింది
-ఏమని పేరు మార్చారు
-అభిమానులు కోరుకునేది ఏంటి
చిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు జరిగే విచిత్రాలని చూస్తే కొంచం వింతగానే అనిపిస్తుంది. కాకపోతే సదరు వింత సినిమాకి ఎలాంటి నష్టం కలిగించకుండా ఉంటే చాలు. నష్టం జరగకుండా చూసే బాధ్యత ప్రధానంగా మూవీ లవర్స్, ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసుకునే రిసీవ్ పైనే సినిమా యొక్క ఆలోచలన్నీ ఉంటాయి. అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం.
హిట్టు,ప్లాప్ తో సంబంధం లేకుండా సుహాస్(Suhas)వరుస చిత్రాలతో సెల్యులాయిడ్ పైకి వస్తన్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే ఈ నెల 20 న 'హే భగవాన్'(Hey Bhagwan)అనే మూవీతో అడుగుపెట్టబోతున్నాడు. లిటిల్ హార్ట్ ఫేమ్ శివాని నాగారం హీరోయిన్ కావడం ప్రత్యేకత. ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు బాగుండటంతో పాటు హే భగవాన్ టైటిల్ తో అయితే మూవీపై క్యూరియాసిటీ ఏర్పడింది.రిలీజ్ కి ముందు అన్ని పనులకి గుమ్మడి కాయ కొట్టాలనే లక్ష్యంతో రీసెంట్ గా' హే భగవాన్' సెన్సార్ కి వెళ్ళింది. టైటిల్ వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావించిన సెన్సార్ వారు టైటిల్ మార్చాలని సూచించింది. దీంతో చిత్ర బృందం ఎలాంటి భేషజాలకి పోకుండా సెన్సార్ చెప్పినట్టుగా తమ సినిమాటైటిల్ ని 'హే బలవంత్' గా మార్చారు.
Also read: 77 లో ఏముంది రవితేజ.. ఫస్ట్ టైం ఎందుకు ఇంత పాజిటివ్
మేకర్స్ అయితే ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు. ఈ క్రమంలోనే చిత్ర కథతో పాటు సుహాస్ తండ్రిగా చేస్తున్న నరేశ్(Naresh)చేసే బిజినెస్ ని కనిపెట్టిన వారికి ఐదుగురు చొప్పున ఒక్కొక్కరికి పాతిక వేల రూపాయలు ప్రకటించారు. తన తండ్రి చేసే బిజినెస్ ఏంటో తెలుసుకొని, సదరు బిజినెస్ ని డెవలప్ చేయాలనుకునేది సుహాస్ లక్ష్యం. గోపి అచ్చర దర్సకత్వంలో వంశీ నిర్మించాడు. టైటిల్ మార్పు అయితే 'హే బలవంత్' పై పడకుండా ఉండాలని అభిమానులు, మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.

![]() |
![]() |