![]() |
![]() |
ఈమధ్యకాలంలో ఎంతో మంది సినీ ప్రముఖులు వివిధ కారణాలతో కన్ను మూసారు. ఇప్పుడు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సూర్యప్రకాష్ గుండెపోటుతో సోమవారం మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ నటుడు శరత్‌కుమార్ సోషల్ మీడియాలో తెలియజేశారు. సూర్యప్రకాష్ మృతి తననెంతో బాధించిందని చెబుతూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘మాణిక్కం’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సూర్య ప్రకాష్.. ఆ తర్వాత శరత్ కుమార్ హీరోగా ‘మాయి’ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో ఆయన ఒకే ఒక్క సినిమా చేశారు. రాజశేఖర్, మీనా జంటగా వచ్చిన ‘భరతసింహారెడ్డి’ చిత్రాన్ని సూర్యప్రకాష్ రూపొందించారు. తమిళ్‌లో శరత్ కుమార్, కిరణ్ రాథోడ్ జంటగా ‘దివాన్’ అనే చిత్రాన్ని రూపొందించారు. పలు తమిళ సినిమాలకు దర్శకత్వం వహించిన సూర్యప్రకాష్ యదార్థ ప్రేమకథ ఆధారంగా ఓ సినిమాను రూపొందించారు. కానీ, ఆ సినిమా ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు. అలాగే ప్రభు ప్రధాన పాత్రలో ఓ సినిమా చేశారు. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది.
![]() |
![]() |