Home  »  News  »  Gaayapadda Simham: 'గాయపడ్డ సింహం'.. 'సుడిగాడు' సీక్వెల్ లాంటి సినిమా!

Updated : Apr 29, 2026

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్పూఫ్ సినిమాలకు మంచి ఆదరణ ఉండేది. ముఖ్యంగా అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' చిత్రం అప్పట్లో అన్ని హిట్ సినిమాలను కలిపి చేసిన హంగామా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో స్పూఫ్ ఎలిమెంట్స్‌తో వస్తున్న సినిమాగా 'గాయపడ్డ సింహం' (Gaayapadda Simham) సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తరుణ్ భాస్కర్, జె.డి. చక్రవర్తి, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం, స్పూఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సరికొత్త ప్రమాణాలను సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

హిట్ సినిమాల స్పూఫ్ లతో సరికొత్త ప్రయోగం:
ఈ సినిమాకు వెళ్తే ప్రేక్షకులు కేవలం ఒక కథను మాత్రమే కాదు.. ఐకానిక్ హిట్ చిత్రాలన్నింటినీ ఒకేసారి వెండితెరపై చూసేయొచ్చు. 'కేజీఎఫ్' ఎలివేషన్లు, 'సలార్' యాక్షన్, 'బొమ్మరిల్లు' ఎమోషన్లు, 'అర్జున్ రెడ్డి' తీవ్రత మరియు 'పోకిరి' మేనరిజమ్స్ వంటి వాటిని దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ వినూత్నంగా మలిచినట్లు సమాచారం. ఈ స్పెషల్ స్పూఫ్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాకుండా, థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అమెరికా కలలు, డీపోర్టేషన్ వంటి సీరియస్ అంశాలను సైతం వ్యంగ్యంగా చూపిస్తూ ఈ కథను సాగించడం విశేషం.

దర్శకుడు మరియు నటుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, జె.డి. చక్రవర్తి 'బ్రూటల్ ధర్మ' అనే స్టైలిష్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే శ్రీవిష్ణు ఒక సర్ప్రైజ్ రోల్‌లో మెరవబోతున్నారు. కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ సాదినేని సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం, మే 1న గ్రాండ్‌గా విడుదల కానుంది. 

చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులు ఒక ఫుల్ లెంగ్త్ పారడీ ఎంటర్టైనర్‌ను థియేటర్లలో చూడబోతున్నారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, ప్రస్తుత సమాజంలోని పరిస్థితులపై సెటైరికల్ డ్రామాగా వస్తున్న 'గాయపడ్డ సింహం' బాక్సాఫీస్ వద్ద 'సుడిగాడు' మేజిక్‌ను రిపీట్ చేస్తుందేమో చూడాలి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.