![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'అఖండ', 'వీరసింహ రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 109'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే దుల్కర్ సల్మాన్ ప్రత్యేక పాత్రలో మెరవనున్నాడని తెలుస్తోంది. ఇక తెలుగు బ్యూటీ చాందిని చౌదరి సినిమాకి అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని, సినిమా అవకాశాలు పొందిన చాందిని.. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా 'కలర్ ఫోటో' చిత్రం ఆమెకి ఎంతో పేరు తీసుకొచ్చింది. అలాగే రీసెంట్ గా 'గామి'తో ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పుడు ఏకంగా బాలయ్య సినిమాలో నటిస్తోంది
గతంలో 'NBK 109' సెట్స్ లో దర్శకుడు బాబీతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తాను బాలకృష్ణ సినిమాలో నటిస్తున్న విషయాన్ని కన్ఫర్మ్ చేసింది చాందిని. ఇక ఇప్పుడు ఆమె పాత్రకి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. సాధారణంగా స్టార్ హీరో సినిమాలలో యంగ్ హీరోయిన్స్ కి పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు లభిస్తుంటాయి. కానీ 'NBK 109'లో చాందిని పాత్ర ఉండదట. కథలో ఆమె పాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆమె పాత్ర కథని మలుపుతిప్పేలా ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే 'NBK 109' తర్వాత చాందినికి మరిన్ని అవకాశాలు క్యూ కట్టే అవకాశముంది.
![]() |
![]() |