![]() |
![]() |

ఇప్పుడు తెలుగునాట ఎక్కడ చూసిన ఒకటే పెళ్లి సందడి. ఆదిదేవుడు నిర్ణయించిన ముహూర్తంలో వేద మంత్రోచ్ఛనాల మధ్య ఎన్నో నూతన జంటలు ఒక్కటవుతున్నారు.కలకలం కలిసి ఉంటామని బాసలు చేస్తున్నారు. తాజాగా ఒక సినీ దర్శకుడు పెళ్లి పీటలు ఎక్కాడు. తన జీవితానికి ఇంకో సరికొత్త శ్రీకారాన్ని చుట్టాడు.
శర్వానంద్ హీరోగా 2021 లో వచ్చిన మూవీ శ్రీకారం. వ్యవసాయం యొక్క ప్రాధాన్యతని చెప్పిన ఆ మూవీ ద్వారా కిషోర్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈయన వివాహం ప్రముఖ యాంకర్ కృష్ణ చైతన్య తో జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున మూడుగంటల సమయంలో కిశోర్ రెడ్డి, కృష్ణ చైతన్య లు ఒక్కటయ్యారు. హైదరాబాద్ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వీరి వివాహం జరిగింది. అత్యంత ఘనంగా జరిగిన ఈ వివాహానికి ఇరువైపుల బంధువులతో పాటు కొంత మంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యి నూతన వధూవరులిద్దరకి శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణ చైతన్య కూడా సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో ఉంది.ప్రస్తుతం పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలతో పాటు మూవీ ఈవెంట్స్ కి యాంకర్‌గా వ్యవహరిస్తుంది.ఆమెకి యాంకర్ కేసీగా మంచి గుర్తింపే ఉంది. గతంలో ఆర్జే స్మైలీ క్వీన్ పేరుతో రేడియో జాకీగా ను పనిచేసింది. కిషోర్ రెడ్డి, కృష్ణ చైతన్య ల జంట మేడ్ ఫర్ ఈచ్ అ ధర్ గా ఉందని అందరు అంటున్నారు.
![]() |
![]() |