![]() |
![]() |

వరుణ్ తేజ్(Varun Tej),హరీష్ శంకర్(Harish Shankar)కాంబినేషన్ లో వచ్చిన 'గద్దలకొండ గణేష్' మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో దర్శకుడు అవ్వాలనే లక్ష్యంతో పాటు, కరుడుగట్టిన రౌడీని సినిమాతో మంచి వ్యక్తిగా మార్చేసే అభి క్యారక్టర్ లో నటించి, మెప్పించిన తమిళ నటుడు అథర్వ(Atharvaa). ప్రముఖ తమిళ హీరో మురళి(Murali)నటవారసుడిగా, 2010 లో 'బాణా కాత్తడి' అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసాడు.
విభిన్నకథాంశంతో కూడిన చిత్రాల్లో చేసే హీరోగా గుర్తింపు పొందిన అథర్వ రీసెంట్ గా “డీఎన్ఏ' (Dna)అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ థ్రిలర్ గా తెరకెక్కిన ఈ మూవీలో అథర్వ సరసన 'నిమిషా సజయన్'(Nimisha Sajayan)హీరోయిన్ గా చేసింది. జూన్ 20న తమిళంలో విడుదలై పర్వాలేదనే టాక్ తెచ్చుకోగా, రేపు అంటే జులై 18 న “మై బేబీ”పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే తమిళంతో పాటు తెలుగు వెర్షన్ లో జులై 19 నుంచి 'జియో' వేదికగా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. ఈ విషయాన్నీ సదరు సంస్థ అధికారంగా ప్రకటించింది. దీంతో కేవలం ఒక్క రోజు గ్యాప్ లోనే తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
'మై బేబీ' ని ఒలింపియా మూవీస్ పతాకంపై 'జయంతి అంబేద్ కుమార్, అంబేద్ కుమార్ సంయుక్తంగా నిర్మించగా నెల్సన్ వెంకటేసన్(Nelson venkatesan)దర్శకుడిగా వ్యవహరించాడు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించడం జరిగింది. తెలుగులో ప్రముఖ నిర్మాత, పాత్రికేయుడు 'కొండేటి సురేష్' రిలీజ్ చేస్తున్నాడు.

![]() |
![]() |