![]() |
![]() |

-సినీ వర్గాల్లో కలకలం
-ఎందుకు తేజ భార్య, కొడుకు పై కేసు
-దీని వెనక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా!
-అసలు కేసు ఏంటి!
తెలుగు సినిమాకి సరికొత్త ప్రేమ కథ చిత్రాలని అందించిన మేకర్ లో తేజ(Teja)కూడా ఒకరు. నేనే రాజు నేనే మంత్రి తో తనలో ఇంకో జోనర్ ఉందని నిరూపించాడు. రీసెంట్ గా తేజ భార్య ప్రణతి, కుమారుడు అమితోవ్ తేజ(Amitov Teja)పై హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు. మరి ఆ కేసు డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
మోతీనగర్ కి చెందిన ప్రణీత్ బ్యాంకు క్రెడిట్ కార్డుల పర్యవేక్షణ విభాగంలో పనిచేస్తున్నాడు. క్రెడిట్ కార్డు అప్లికేషన్ విషయంలో గత సంవత్సరం అమితోవ్ తో ప్రణీత్ కి పరిచయమయ్యింది.ఆ తరువాత అమితోవ్, ప్రణీత్, అతని భార్య ముగ్గురు కలిసి షేర్ మార్కెట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ ప్రారంభించారు. తేజ తరఫున ప్రణీత్ ట్రేడింగ్ చేయగా దాదాపుగా 11 లక్షల నష్టం వచ్చింది.ఈ విషయం మొత్తం వ్యవహారంపై జూబ్లీ హిల్స్ పోలీసులకి ప్రణీత్ ఫిర్యాదు చేస్తూ నష్టాన్ని భర్తీ చేసేందుకు మరింత డబ్బు పెట్టాలని అమితోవ్ ఒత్తిడి తెచ్చాడు.
అందుకు నిరాకరించడంతో అమితోవ్ తల్లి, అనుచరులు కొంతమంది నన్ను అక్రమంగా నిర్బంధించి ఖాళీ పేపర్లు, చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. నా భార్యతో ఆస్తి కాగితాలపై కూడా సంతకాలు చేయించుకున్నారని ప్రణీత్ జూబ్లీ హిల్స్ పోలీసులకి ఫిర్యాదు చేసాడు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో నాంపల్లి కోర్టుని ఆశ్రయించి సదరు విషయాలన్నీ చెప్పడం జరిగింది.
Also read: ఓటిటి లోకి వచ్చేస్తున్నా.. డేట్ ఇదే !
ఈ విషయాన్ని పరిశీలించిన కోర్టు,అమితోవ్ అనుచరులు, తల్లిపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది.ఇక ఇదే వ్యవహారంలో పెట్టుబడి పేరిట ప్రణీత్, అతని భార్య 72 లక్షలు మోసం చేశారని అమితోవ్ సైతం ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అమితోవ్ తన తండ్రి దర్శకత్వంలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు.

![]() |
![]() |