Home  »  News  »  స్టేజ్‌పై నడుము పట్టుకున్న ఆకతాయి.. చెంప పగలగొట్టిన డాన్సర్ డింపుల్ చౌదరి

Updated : Jun 6, 2026

 

 ఒక ప్రైవేట్ పుట్టినరోజు వేడుక కార్యక్రమానికి ప్రముఖ హరియాణ్వీ స్టేజ్ డాన్సర్ డింపుల్ చౌదరి(Dimple choudhary)ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై ఆమె ఎంతో ఉత్సాహంగా డాన్స్ పెర్ఫార్మ్ ఇస్తుండగా, ఆమెను చూసేందుకు వందలాది మంది గ్రామీణులు, స్థానిక ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.

ఒక  యువకుడు ఒక్కసారిగా స్టేజ్ పైకి దూసుకువచ్చి, డాన్సర్ డింపుల్ చౌదరి నడుముని  తాకుతూ  అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఊహించని ఈ దారుణమైన ఘటనతో డింపుల్ చౌదరి తీవ్ర షాక్‌కి  గురయ్యారు. కానీ ఏమాత్రం భయపడకుండా, వెంటనే ఆ ఆకతాయి చెంప చెళ్లుమనిపించింది. నడిరోడ్డుపై, అందరి ముందూ స్టేజ్ పైనే ఆ కీచకుడి చెంప పగలగొట్టారు. ఒక్క క్షణంలో జరిగిన ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. డింపుల్ చౌదరి అక్కడితో ఆగకుండా, వెంటనే మైక్ అందుకుని మహిళా కళాకారుల పట్ల ఇలాంటి అసభ్య ప్రవర్తనని సహించేది లేదని హెచ్చరిస్తూ, పర్ఫార్మెన్స్‌ను మధ్యలోనే నిలిపివేసి స్టేజ్ దిగి వెళ్ళిపోయారు.

Also read: Prabhas: ప్రభాస్ తండ్రి మాకు ముందుగానే చెప్పారు.. ప్రముఖ నిర్మాత వ్యాఖ్యలు వైరల్ 

డింపుల్ చౌదరి స్వయంగా  ఈ వీడియోని  తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. జూన్ 3 న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి సురేష్ కుమార్‌ను అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథరస్ జిల్లా స్థానిక శాసని పరిధిలోని నగ్లా నాయి గ్రామంలో సంఘటన జరిగింది.సదరు వీడియో యూట్యూబ్ లో వైరల్ కూడా అవుతుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.