![]() |
![]() |
.webp)
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు(Dil Raju)కి తెలుగు చిత్ర పరిశ్రమతో ఉన్న అనుబంధం సుమారు మూడున్నర దశాబ్దాలపైనే.కంటిన్యూగా సినిమాలు నిర్మిస్తు ఎంతో మంది సినీ కార్మికులకి పని కలిపించడమే కాకుండా,పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.రీసెంట్ గా 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam)తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న దిల్ రాజు ప్రస్తుతం ఫిలిం డెవలప్ మెంట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
రీసెంట్ గా మూవీ పైరసీ పై ఆయన మాట్లాడుతు'పైరసీ'(Piracy)వల్ల ఎవరి సినిమా ఎఫెక్ట్ అయితే వాళ్లే మాట్లాడుతున్నారు.కానీ శుక్రవారం మాట్లాడితే,సోమవారానికి మర్చిపోతున్నారు.
పైరసీకి అడ్డుకట్ట వేయాలంటే ఒక ఉద్యమం కావాలి.ఎఫ్ డి సి చైర్మన్ గా నేను లీడ్ చెస్తాను.పైరసీ వల్ల డబ్బులు పోయేవి నిర్మాతలవే.కాబట్టి నిర్మాతలందరు ఈ విషయంలో కలిసి రావాలి. అండర్ ప్రొడక్షన్స్ లో ఉన్నవారు కూడా పైరసీ కి అడ్డుకట్ట వేసే విషయంలో కలిసి ముందుకు రావాలని చెప్పాడు.
![]() |
![]() |