Home  »  News  »  Dhurandhar 2: ధురంధర్ 2 తొలి రోజు కలెక్షన్స్ ఇవే.. పుష్ప2కి ఎసరు పెడుతుందా!

Updated : Mar 20, 2026

 

-పెయిడ్ ప్రీమియర్స్ తో టేక్ ఆఫ్ అయిన ధురంధర్ 2 
-అన్ని ఏరియాస్ లో పాజిటివ్ టాక్ 
-ఆ సినిమా రికార్డులన్నీ గల్లంతు కాబోతున్నాయా!
-తొలి రోజు ఎంత రాబట్టిందో చూద్దాం.

ఎంటైర్ భారతావని అగస్ట్ 15 తో పాటు ఫెస్టివల్స్ ని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటుందో, అదే విధంగా ఈ మధ్య కాలంలో ఒక సినిమా రిలీజ్ డేట్ ని గుర్తుపెట్టుకున్నారంటే 'ధురంధర్ 2 'అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా ధురంధర్ 2(Dhurandhar 2)భారతీయులతో మమేకమైంది. వాళ్ళు అనుకున్నట్టుగానే 18 సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడటంతో చలో టూ ధురంధర్ 2 అంటు థియేటర్స్ లోపలకి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళ ముఖాల్లో ధురంధర్ 2 చుస్తున్నామన్న గర్వం కూడా చాలా స్పషంగా కనపడింది. మరి అంతటి క్రేజ్ ని అందుకున్న ధురంధర్ 2  ఫస్ట్ డే ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా 236 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇండియా వైడ్ గా చూసుకుంటే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 75 కోట్ల గ్రాస్,  నిన్న 100 కోట్ల గ్రాస్ తో మొత్తం 175 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా చెప్తున్నారు . దీంతో బాలీవుడ్ హిస్టరీలోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన తొలి బాలీవుడ్ మూవీగా  నిలిచింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఆధిపత్యాన్ని చెలాయించిన షారుక్ ఖాన్ జవాన్ మూవీ ధురంధర్ 2 కి వెల్ కమ్ చెప్పి సైడ్ అవ్వాల్సిన పరిస్థితి. 

Also read: UStaad Bhagat Singh: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్!.. ధురంధర్ 2 అవుట్ 

ప్రెజెంట్ ధురంధర్ 2 అన్ని ఏరియాస్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రణవీర్ సింగ్(Ranveersingh)వన్ మాన్ షో విశ్వరూపాన్ని ఆదిత్య దర్(Aditya Dhar)పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చెయ్యడమే పాజిటివ్ టాక్ కి కారణం. మరి ఈ లెక్కన తొలి రోజే 236 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటే లాంగ్ రన్ లో రికార్డు కలెక్షన్స్  సాధించడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ లెక్కన పుష్ప 2 టోటల్ కలెక్షన్స్ కి ధురంధర్ 2 ఎసరు పెట్టే అవకాశం ఉంటుందేమో అనే చర్చ సైతం ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతుంది. ధురంధర్ మొదటి భాగం 1300 కోట్ల దగ్గరే ఆగిపోగా, పుష్ప 2 పూర్తి రన్నింగ్ లో 1700 కోట్ల రూపాయిల వరకు రాబట్టింది. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.