Home  »  News  »  Gaddar Awards: రేవంత్ రెడ్డి సాక్షిగా చంద్రబాబుకి చిరంజీవి రిక్వెస్ట్!

Updated : Mar 19, 2026

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ వేడుక హైదరాబాద్‌ లో వైభవంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఈ ఏడాది 'ఎన్టీఆర్‌ నేషనల్ అవార్డు'ను మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అందుకున్నారు. చిరంజీవికి ఈ అవార్డును రేవంత్ రెడ్డి ప్రధానం చేశారు. (Gaddar Awards)

'ఎన్టీఆర్‌ నేషనల్ అవార్డు' అందుకున్న అనంతరం చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అంటారు. దానిని రేవంత్ రెడ్డి గారు సరిగ్గా అర్థం చేసుకున్నారు. కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చేయబడ్డ సినిమా అవార్డులను మళ్ళీ పునరుద్ధరించారు." అంటూ రేవంత్ పై ప్రశంసలు కురిపించారు.

అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుకి చిరంజీవి ఓ విజ్ఞప్తి చేశారు. సినిమా అవార్డుల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. సినిమా వాళ్ళకు అతి దగ్గరగా ఉండే చంద్రబాబు గారు.. దీనిని స్ఫూర్తిగా తీసుకొని కళాకారులను ప్రోత్సహిస్తూ అవార్డులు ఇస్తే బాగుంటుందని చిరంజీవి రిక్వెస్ట్ చేశారు.

అవార్డుల జాబితా:

  • ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి
  • రెండవ ఉత్తమ చిత్రం -  దండోరా
  • మూడవ ఉత్తమ చిత్రం -  ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్‌ షో
  • ఉత్తమ పర్యావరణ చిత్రం  - ఇగ్వా
  • ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ - లిటిల్‌ హార్డ్స్
  • ఉత్తమ వినోదాత్మక చిత్రం  - సంక్రాంతికి వస్తున్నాం
  • ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం - కోర్టు
  • ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్‌
  • ఉత్తమ బాలల చిత్రం  - అనగనగా
  • ఉత్తమ నటుడు- నాగచైతన్య (తండేల్‌)
  • ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్ )
  • ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
  • ఉత్తమ సహాయ నటుడు - శివాజీ (దండోరా)
  • ఉత్తమ సహాయ నటి - భూమిక (యుఫోరియా )
  • ఉత్తమ సంగీత దర్శకుడు-  మార్క్ కె. రాబిన్  (దండోరా)
  • ఉత్తమ మేల్‌ సింగర్‌- అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • ఉత్తమ ఫిమేల్‌ సింగర్‌- సాహితి చాగంటి (కన్నప్ప)
  • ఉత్తమ కమెడియన్ - శ్రీ కృష్ణ తేజ (జిగ్రిస్‌)
  • ఉత్తమ బాలనటుడు - రోహన్‌ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో )
  • ఉత్తమ స్టోరీ రైటర్‌ - గుణశేఖర్‌ (యుఫోరియా )
  • ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ - అనిల్‌ రావిపూడి
  • ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్‌ (కుబేర)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
  • ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)
  • ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ - ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ (కిష్కిందపురి)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - గిర గిర గిర (ఛాంపియన్‌)
  • ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ - తోట తరణి (ఛాంపియన్‌)
  • ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ - గోవింద్‌ (అఖండ)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ -  చంద్రకాంత్‌ (ఛాంపియన్‌)

స్పెషల్‌ జ్యూరీ అవార్డులు..

  • శ్రీరాజ్ రాచకొండ (23 మూవీ)
  • చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • రోషన్‌ మేక (ఛాంపియన్‌)
  • అనంతిక సనీల్ కుమార్‌ (8 వసంతాలు)

స్పెషల్‌ అవార్డులు..

  • ఎన్టీఆర్‌ నేషనల్ అవార్డు - చిరంజీవి
  • పైడి జైరాజ్ అవార్డు - కమల్‌ హాసన్‌
  • బీఎన్‌రెడ్డి ఫిల్మ్‌ అవార్డు- సింగీతం శ్రీనివాసరావు
  • నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - అశ్వనీ దత్‌
  • కాంతారావు అవార్డు - ఆర్‌. నారాయణమూర్తి
  • రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డు - రమేష్ ప్రసాద్‌
  • సి.నారాయణరెడ్డి ఫిల్మ్‌ అవార్డు - సుద్దాల అశోక్‌ తేజ
  • అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్‌ అవార్డు - జయసుధ






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.