![]() |
![]() |

శర్వానంద్ ప్రస్తుతం కెరీర్ పరంగా క్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నాడు. 2017లో వచ్చిన 'మహానుభావుడు' మూవీ తర్వాత ఇంతదాకా అతనికి మరో హిట్ దక్కలేదు. 'పడిపడి లేచే మనసు', 'శ్రీకారం' ఓ మోస్తరుగా ఆడగా.. 'రణరంగం', 'జాను', 'మహాసముద్రం', 'ఆడవాళ్లు మీకు జోహార్లు' డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈనెల 9న అతని ద్విభాషా చిత్రం 'ఒకే ఒక జీవితం' రిలీజవుతోంది.
కాగా కిందకు పడిపోతున్న కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు శర్వానంద్ సంకల్పించాడు. కథల విషయంలో మరింత శ్రద్ధ చూపిస్తున్నాడు. లుక్స్ పరంగా కూడా మారాలని నిర్ణయించుకొని వెయిట్ తగ్గించుకుంటున్నాడు.
ఎనిమిది నెలలుగా కొత్త సినిమా ఏదీ సెట్స్ మీదకు తీసుకురాని శర్వానంద్.. కొత్త సినిమాని మొదలుపెట్టబోతున్నాడు. 'రౌడీ ఫెలో', 'చల్ మోహన్‌రంగ' సినిమాల దర్శకుడు కృష్ణచైతన్య ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. కాగా శర్వానంద్ జోడీగా ఫస్ట్ టైమ్ రాశీ ఖన్నా ఇందులో నటించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఈ సినిమా సోమవారమే లాంఛనంగా ప్రారంభం కానున్నది.
![]() |
![]() |