![]() |
![]() |

కొన్ని సినిమాలు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని కలుగచేస్తాయి. హీరో, హీరోయిన్, దర్శకుడికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆసక్తి అనేది సహజం. కానీ శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు రిలీజ్ అయిన ఒక మూవీ పోస్టర్ లో ఎలాంటి వివరాలు లేవు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
చిత్రాలయం స్టూడియోస్(Chitralayam studios) ఈ సంస్థ ప్రస్తుతం గోపిచంద్ (gopichand) హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం(viswam) అనే చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ దశలో ఉంది.చిత్రాలయం బ్యానర్ కి అదే మొదటి సినిమా. ఇక తమ తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ తో ఈ విషయాన్ని తెలిపారు. ఋషి గెటప్ లో ఉన్న ఒక వ్యక్తి చేతిలో ఒక సంచిని పట్టుకొని నడుచుకుంటు వెళ్తున్నాడు.పక్కనే అయోధ్య 1177 కిలోమీటర్లు అనే బోర్డు ఉంది.అంటే అతను అయోధ్య కి బయలుదేరి వెళ్తున్నాడనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. జర్నీ టు అయోధ్య(Journey To Ayodhya)ఆగమనం 2025 అని కూడా పోస్టర్ లో ఉంది. అంటే సినిమా 2025 లో వస్తుందన్న క్లారిటీ ని ఇచ్చారు. కాకపోతే జర్నీ టు అయోధ్య అనేది వర్కింగ్ టైటిల్ నా లేక అదే సినిమా టైటిల్ నా అనేది త్వరలోనే తెలుస్తుంది.

పోస్టర్ ని చూస్తుంటే మాత్రం అయోధ్య రాముడిని ప్రధాన పాత్రగా చేసుకొని రూపొందిస్తునట్టుగా తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య కథను అందిస్తుండగా ఒకప్పటి నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుండగా వేణు దోనేపూడి(venu dhonepudi)నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తుంది.
![]() |
![]() |