Home

»

Latest News

వాట్ ఏ థాట్.. వాట్ ఏ విజన్.. హీరోయిన్ లందు సంయుక్త వేరయా.. 

Apr 17, 2024 4:45PM

నిస్సహాయులైన మహిళలకు అండగా నిలబడేందుకు ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ ముందుకొచ్చింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించేందుకు, సహాయం అందించేందుకు సంయుక్త అడుగు ముందుకు వేసింది. ఇవాళ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా 'ఆదిశక్తి' అనే సేవా సంస్థను అనౌన్స్ చేసింది. ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించబోతోంది. 

మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో 'ఆదిశక్తి' సంస్థను స్థాపించినట్లు సంయుక్త తెలిపింది. అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ చేయూతనివ్వనుంది. విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో మహిళలకు సపోర్ట్ గా నిలవనుంది ఆదిశక్తి సంస్థ. మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని, అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది ఆదిశక్తి సంస్థ ఉద్దేశమని సంయుక్త పేర్కొంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com