![]() |
![]() |

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ 'విశ్వంభర'(Vishwambhara).'జగదేక వీరుడు అతిలోకసుందరి' తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను విశ్వంభర' పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన చివరి సాంగ్ ని కూడా చిరంజీవి కంప్లీట్ చెయ్యడం జరిగింది. ఈ ఏడాది సంక్రాంతికే 'విశ్వంభర' విడుదల కావాల్సి ఉంది. రీసెంట్ గా విశ్వంభర కి సంబంధించి చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు.
అందులో చిరంజీవి మాట్లాడుతు 'విశ్వంభర' ఎందుకు డిలే అవుతుందని చాలా మందికి డౌట్ ఉంది. ఈ ఆలస్యం విశ్వంభర కి సంబంధించి కరెక్ట్ అని అనుకుంటున్నాను. విశ్వంభర సెకండ్ ఆఫ్ మొత్తం విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పై ఆధారపడి ఉంది. అత్యున్నత ప్రమాణాలతో, బెస్ట్ క్వాలిటీ తో విశ్వంభర ని మీ ముందు ఉంచాలనే దర్శక నిర్మాతల ప్రయత్నమే ఆలస్యానికి ప్రధాన కారణం. సినిమా విషయంలో ఎలాంటి విమర్శలు రాకూడదనే మా ప్రయత్నం. చందమామ కథలాగా సాగిపోయే అద్భుతమైన కథ. చిన్న పిల్లలకి, ముఖ్యంగా పెద్ద వాళ్ళల్లో ఉండే చిన్నపిల్లలకి ఎంతో వినోదాన్ని ఇస్తుంది. నా పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు సాయంత్రం 6 .06 నిమిషాలకి విశ్వంభర నుంచి గ్లింప్స్ రాబోతుంది. అది మీ అందర్నీ ఆకట్టుకుంటుంది. వయసుతో సంబంధం లేకుండా అందరు ఎంజాయ్ చేసే సమ్మర్ సీజన్ లో
విశ్వంభర విడుదల కాబోతుందని తెలిపాడు. అగస్ట్ 22 చిరంజీవి పుట్టిన రోజనే విషయం తెలిసిందే.
విశ్వంభర లో చిరంజీవి సరసన 'త్రిష'(Trisha)తో పాటు 'ఆషిక రంగనాధ్'(Ashika Ranganath)జంటగా చేస్తుండగా యువి క్రియేషన్స్(Uv Creations)పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో ఇప్పటికే రన్ రాజా రన్, రాధే శ్యామ్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి పలు చిత్రాలు వచ్చాయి. నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార ని తెరకెక్కించిన వశిష్ట మల్లిడి (Vasishta Mallidi)దర్శకుడు కాగా ఆస్కార్ విన్నర్ కీరవాణి(MM.keeravani)మ్యూజిక్.

![]() |
![]() |