![]() |
![]() |

ప్రముఖ సినీ నిర్మాత, రామోజీ ఫిలిం సిటీ అధినేత,'రామోజీరావు'(Ramoji Rao)గారు, బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి 'ఈటీవీ' (Etv)అనే ఛానల్ ని స్థాపించిన విషయం తెలిసిందే. 1995 అగస్ట్ 27 న ప్రారంభమైన 'ఈటీవీ' ప్రస్తుతం పలు ఛానల్స్ ని అనుసంధానంగా చేసుకొని భారతదేశంలోని పలు భాషల్లో విస్తరించి ఉంది. సదరు చానల్స్ లో వచ్చే కార్యక్రమాలన్నీ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తు వస్తున్నాయి. రీసెంట్ గా ఈటీవీ 30 వ వార్షికోత్సవ వేడుకలు ఫిలింసిటీలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు 'ఈటీవీ' 30 వ వార్షికోత్సవ సభకి రావడం నా భాద్యత. 1995 లో జరిగిన ఈటీవీ ప్రారంభ వేడుక నా కళ్ళ ముందు ఉంది. మొదటి వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా రావడంతో పాటు 20 వ వార్షికోత్సవానికి కూడా వచ్చాను. కొవిడ్ కారణంగా 25 వ వార్షికోత్సవం చేయలేకపోయారు. కానీ నా మీద ప్రేమతో మా ఇంటికి కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. ఆ సమయంలో నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. మళ్ళీ ఈ వేడుకలో భాగం కావడం నా అదృష్టం.
రామోజీరావు గారు నాకెప్పుడు స్ఫూర్తే. ఎప్పుడు కలిసినా, ఆయన చెప్పే మాటల ద్వారా కొత్త విషయాలు నేర్చుకునే వాడ్ని. ఎక్కడో పల్లెటూరిలో పుట్టిన రామోజీరావు గారు, మనం ఉండాల్సింది ఇక్కడ కాదు, చరిత్ర సృష్టించాలని భావించారు. ఈనాడు, మార్గదర్శి, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ తో అనుకున్నట్టుగానే ఆయన తన పేరుని చరిత్రలో శాశ్వతంగా ఉండేలా చేసుకున్నారని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు(K.Raghavendrarao)నిర్మాత సురేష్ బాబు(Suresh Babu)కీరవాణి(Keeravani)ఖుష్భు(Kushboo),మురళి మోహన్(Murali Mohan)తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
![]() |
![]() |