![]() |
![]() |

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ 'ది రాజా సాబ్' అనే రొమాంటిక్ హారర్ కామెడీ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదట్లో ప్రభాస్ స్టార్డంకి తగ్గ అంచనాలు లేవు. కానీ, రాజా సాబ్ నుంచి ఎప్పుడైతే కంటెంట్ విడుదలైందో.. ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. లుక్స్ పరంగా, కామెడీ టైమింగ్ పరంగా.. వింటేజ్ ప్రభాస్ ను చూడబోతున్నామని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. (The Raja Saab)
డార్లింగ్, మిర్చి సమయంలో ప్రభాస్ సినిమాల్లోని సాంగ్స్ ఎంతో బాగుండేవి. దాదాపు సినిమాలోని ప్రతి పాట హిట్ అయ్యి.. ఆల్బమ్ మారుమోగిపోయేది. 'బాహుబలి' నుంచి ప్రభాస్ ఎక్కువగా భారీ సినిమాలు చేస్తున్నారు. దాంతో కథలో భాగమయ్యే పాటలే తప్ప.. ఫ్యాన్స్ పాడుకునే పాటలు పెద్దగా రావట్లేదు. ఆ లోటుని తీర్చేలా 'ది రాజా సాబ్' ఆల్బమ్ ఉంటుందని సమాచారం.
తమన్ సంగీతం అందిస్తున్న రాజా సాబ్ లో మొత్తం ఐదు పాటలు ఉంటాయట. ఇంట్రో సాంగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అంటున్నారు. అలాగే ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు హీరోయిన్లతో అదిరిపోయే మాస్ సాంగ్ ఉంటుందట. ప్రభాస్-మాళవిక కాంబోలో మరో మాస్ సాంగ్ ప్లాన్ చేశారట. అలాగే డార్లింగ్ రోజులను గుర్తు చేసేలా ఓ మెలోడీ సాంగ్ ఉంటుందట. రాజా సాబ్ థీమ్ సాంగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. మొత్తానికి క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరూ మెచ్చేలా 'ది రాజా సాబ్' ఆల్బమ్ ను ప్లాన్ చేస్తున్నారట.
![]() |
![]() |