![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత నిర్మించిన వెబ్ సిరీస్ 'పరువు'. నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ జీ5 లో స్ట్రీమ్ అవుతోంది. 'పరువు' సిరీస్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా దీనిపై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
'పరువు' టీం కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. తన కూతురు సుష్మిత ఇలాంటి అద్భుతమైన సిరీస్ ను నిర్మించడం పట్ల గర్వంగా ఉందని అన్నారు. అలాగే సోదరుడు నాగబాబు అద్భుతంగా ఉందని కొనియాడారు. అంతేకాదు, "ఒక చక్కటి ప్లాన్ తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై MLA గారి పాట్లు. లాస్ట్ కి ఈ జంట తప్పించుకుందా లేదా అని season 2 లోనే చూడాలనుకుంటా" అంటూ సీజన్ 2 గురించి కూడా ట్వీట్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. చిరు ట్వీట్ తో పరువు సిరీస్ చూసే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

![]() |
![]() |