![]() |
![]() |
.webp)
నటసింహం నందమూరి బాలకృష్ణ తన బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ కి మ్యాచ్ అయ్యే టైటిల్ తో సందడి చేయనున్నారా? అవునన్నదే టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. డబుల్ హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో నడివయస్కుడైన తండ్రిగా బాలయ్య కనిపించనుండగా.. అతనికి కూతురిగా `పెళ్ళి సంద-డి` ఫేమ్ శ్రీలీల దర్శనమివ్వనుంది. ప్రియమణి, అంజలి ముఖ్య పాత్రల్లో ఎంటర్టైన్ చేయనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, బాలయ్య పాత్రనుసారం ఈ చిత్రానికి `బ్రో! ఐ డోన్ట్ కేర్` అనే ట్రెండీ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు బజ్. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రేపు (జూన్ 10) ఈ టైటిల్ ని రివీల్ చేసే అవకాశముందని చెప్పుకుంటున్నారు. మరి.. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రాబోతున్న బాలయ్య - అనిల్ రావిపూడి కాంబో బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
కాగా, బాలకృష్ణ ప్రస్తుతం `క్రాక్` దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇదే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా జనం ముందుకు రానుంది.
![]() |
![]() |