![]() |
![]() |

`ఆది` (2002) వంటి సంచలన చిత్రం తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా `సాంబ` (2004). `ఆది` తరహాలోనే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. విద్యాదానం గొప్పతనం చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో `సాంబ`గా టైటిల్ రోల్ లో తారక్ మెస్మరైజ్ చేయగా.. అతనికి జంటగా భూమికా చావ్లా, జెనీలియా సందడి చేశారు. ప్రకాశ్ రాజ్, విజయ కుమార్, సితార, సుకన్య, సుకుమారి, అలీ, కృష్ణ భగవాన్, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, చలపతిరావు, ప్రగతి, రఘుబాబు, ఆహుతి ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. జీఎస్ రావు కథకి వినాయక్ స్క్రీన్ ప్లే, కోన వెంకట్ సంభాషణలు సమకూర్చారు.
మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలకు అనుగుణంగా భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, చంద్ర బోస్, సాహితి పదరచన చేశారు. ``నందమూరి చందమామ``, ``నమస్తే నమస్తే``, ``సాంబ సాంబ``, ``లక్సంబర్గ్ లక్స్ సుందరి``, ``కితకితలు పెట్టమాకు``, ``తగిలినదిరబ్బా``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. కొడాలి మూవీస్ పతాకంపై కొడాలి నాని నిర్మించిన `సాంబ`.. కన్నడంలో `మండ్య` (దర్శన్, రక్షిత, రాధిక), బెంగాలీ బంగ్లాదేశ్ లో `ఏక్ రోఖా` (మన్న) పేర్లతో రీమేక్ అయింది. కాగా, 2004 జూన్ 9న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను అలరించిన `సాంబ`.. నేటితో 18 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |