![]() |
![]() |
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ‘సలార్’తో బాక్సాఫీస్‌ను బద్దలు చేశాడు డైనోసార్. ఐదురోజుల్లో 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి తన స్టామినా ఏమిటో చూపించాడు. ప్రభాస్ సాధించిన ఘనవిజయానికి అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సోదరుడు, నిర్మాత ప్రణయ్‌రెడ్డి ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. ‘యానిమల్’ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా.. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే న్యూస్ బయటికి వచ్చింది. ప్రణయ్‌రెడ్డి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చాడు.
నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘కల్కి 2898’ ఎలా ఉంటుందనే విషయంలో ఆడియన్స్‌లో క్లారిటీ వుంది. అలాగే మారుతి డైరెక్షన్‌లో వస్తున్న రాజా డీలక్స్ ఎలాంటి సినిమా అనే దాంట్లో ఒక అంచనా ఉంది. కానీ, ‘స్పిరిట్’కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ప్రభాస్‌ని సందీప్‌రెడ్డి ఎలాంటి చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉంది. ఈ విషయమై ప్రణయ్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రభాస్ తన కెరీర్లోనే తొలిసారి పోలీసు డ్రెస్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు సందీప్ చిత్రాల్లో హీరో పాత్రలు ఎలాగైతే ఉన్నాయో.. స్పిరిట్‌లో ప్రభాస్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ఒక యాంగ్రీ యంగ్ కాప్‌గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతానికి హీరో క్యారెక్టర్ గురించి మాత్రమే చెప్పగలను. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభ అయ్యే అవకాశం ఉంది’ అని వివరించారు.
![]() |
![]() |