![]() |
![]() |

లెజండ్రీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(Ar Rahman)కంపోజ్ చేసిన ఎన్నో హిట్ సాంగ్స్ ల్లో 'వీరారాజవీరా' (Veera Raja Veera)కూడా ఒకటి. ఈ సాంగ్ మద్రాస్ టాకీస్ పై మణిరత్నం(Manirathnam)దర్శకత్వంలో 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2'(ponniyin selvan part 2)చిత్రంలోనిది. జయం రవి, శోభిత అక్కినేనిపై చిత్రీకరణ జరుపుకున్న ఈ సాంగ్ అన్ని భాషల్లోను విశేష ఆదరణ పొందింది.
ఈ 'వీరారాజవీరా’ సాంగ్ ట్యూన్ ని రెహమాన్ కాపీ కొట్టారని ఢిల్లీ హైకోర్టులో సింగర్ 'ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ డగర్' కొంత కాలం క్రితం పిటీషన్ వెయ్యడం జరిగింది. తన పిటిషన్ లో చాలా స్పష్టంగా ఆ ట్యూన్ తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతాన్ని అందించిన 'శివస్తుతి' పాట నుంచి రెహమాన్ కాపీ కొట్టారని పేర్కొన్నాడు. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పుని వెల్లడించింది. ఏఆర్ రెహమాన్, మద్రాస్ టాకీస్ సదరు పిటీషన్‌దారుడికి రెండు కోట్ల రూపాయలని చెల్లించాలని తన ఆదేశాల్లో పేర్కొంది.
రెహమాన్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో 'పెద్ది' చేస్తున్న విషయం తెలిసిందే. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజవ్వగా, రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మంచి పేరు వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ సాంగ్ విషయంలో రెహమాన్ కి కోర్ట్ షాక్ ఇవ్వడంతో,పెద్ది విషయంలో ఇలాంటివి జరగకుండా ఉండాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

![]() |
![]() |