![]() |
![]() |

సినీ రంగంలో రాణించాలని ఎందరో ఆశపడుతుంటారు. అలాంటి వారి ఆశని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) పేరుతో కొందరు కేటుగాళ్లు అలాంటి మోసం చేయడానికి ప్రయత్నించారు.
తాము నిర్మించే సినిమాలో నటించడానికి నూతన నటీనటులు కావాలంటూ అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఒక క్యాస్టింగ్ కాల్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసి నిజంగానే అన్నపూర్ణ స్టూడియోస్ క్యాస్టింగ్ కాల్ అని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది అన్నపూర్ణ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించింది. ఈ క్యాస్టింగ్ కాల్ ఫేక్ అని తెలిపింది. ఇటువంటి వారికి మీ వ్యక్తిగత సమాచారం పంపడం, డబ్బు పంపించడం వంటివి చేయకండని సూచించింది. తమ సంస్థ నుంచి ఏదైనా క్యాస్టింగ్ కాల్ ఉంటే.. అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానో లేక వెబ్ సైట్ ద్వారానో తెలియజేస్తామని అన్నపూర్ణ పేర్కొంది.

![]() |
![]() |