![]() |
![]() |

పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'రక్షణ' (Rakshana). 'ఆర్‌ఎక్స్ 100', 'అనగనగా ఓ అతిథి', 'మంగళవారం' వంటి సినిమాలతో ఆకట్టుకున్న పాయల్.. మొదటిసారి పోలీస్ పాత్రలో నటించింది. ప్రణ్‌దీప్ ఠాకూర్ దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జూన్ 7 న థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
'రక్షణ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఓటీటీ వేదిక ఆహా దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 1 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. "లేడీ సింగం గర్జించడానికి సిద్ధంగా ఉంది" అంటూ పోస్టర్ ను విడుదల చేసింది. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

హరి ప్రియ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన రక్షణ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా అనిల్ బండారి, ఎడిటర్ గా గ్యారీ వ్యవహరించారు.
![]() |
![]() |