![]() |
![]() |

తన మాజీ ప్రియుడు భవీందర్ సింగ్ దత్ పై హీరోయిన్ అమలా పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిత్రులతో కలిసి అతను తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
2018లో భవీందర్ తో కలిసి అమలా పాల్ ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. అందులో అమలా పాల్ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సంస్థ లావాదేవీలలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో భవీందర్ సింగ్ కు ఆమె దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో సంస్థ డైరెక్టర్ గా తన పేరుని తొలగించి, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే, తన ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని భవీందర్ బెదిరిస్తున్నట్లు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. అంతేకాదు అతని మిత్రులు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
అమలాపాల్ ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద భవీందర్ మరియు అతని స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే భవీందర్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
![]() |
![]() |