![]() |
![]() |

సినీ పరిశ్రమ మునుపటిలా లేదు. ఒకప్పుడు కేవలం థియేటర్లో విడుదలైన కలెక్షన్ల మీద మాత్రమే సినిమాల వసూళ్లు వాటి రాబడులు ఆధారపడి ఉండేవి. కానీ నేడు మరి ముఖ్యంగా కరోనా మొదలైన తరువాత సినీ పరిశ్రమ తీరుతెన్నులే మారిపోయాయి. థియేటికల్ బిజినెస్‌లకు సరిసమానంగా రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఓటిటి ఆఫర్లు... ఇలా నాన్ ధియేటికల్ ద్వారా నిర్మాతలకు వచ్చే ఆదాయం బాగా పెరిగింది. ఇలా పలు రకాలుగా సినిమాకు ఆదాయ మార్గాలు పెరిగాయి. చాలా చిత్రాలు నాన్ థియేటికల్ రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయాలతోనే కష్టాల నుండి బయటపడి లాభాల బాటనెక్కిన సంగతి కూడా తెలిసిందే. ఇంకా ఓటిటి ప్లాట్ ఫామ్ లో పలు చిత్రాలకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. విషయానికి వస్తే తాజా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఆచార్య చిత్రంతో కాస్త ఫ్లాప్ ని అందుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ కి వచ్చిన క్రేజ్ దృష్ట్యా ఆయన పాన్ వరల్డ్ రేంజ్ లో పాపులర్ అయ్యారు.
దాంతో తన 15 చిత్రాన్ని గ్రేట్ డైరెక్టర్, డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. విలన్ పాత్రను తమిళ నటుడు, దర్శకుడు ఎస్‌జె సూర్య పోషిస్తుండడం విశేషం. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ తండ్రీ తనయులుగా కనిపించనున్నారు. తండ్రి పాత్రకు అంజలి జోడి కాగా తనయుడి పాత్రకు కియారా అద్వానీ జోడీగా నటిస్తోంది. 1990 నాటి నేపథ్యంలో తండ్రి పాత్ర కొనసాగుతుందని తనయుడి పాత్ర ప్రస్తుత కాలానికి సంబంధించిందని తెలుస్తోంది. ఈ మూవీని సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో ఓ సెటైరికల్ పొలిటికల్ మూవీగా శంకర్ తెరపైకి తీసుకొని వస్తున్నారని సమాచారం. ఇప్పటికే రాజమండ్రిలో షూటింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత న్యూజిలాండ్ వెళ్లి ఓ పాటను తీశారు. మరలా ఇప్పుడు రాజమండ్రి గోదావరి తీరాన ఇసుకదిన్నెల పై రాజకీయ సభకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరించారు.
ఈ షెడ్యూలు కూడా పూర్తయింది. తాజాగా కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద చరణ్‌తో కొన్ని కీలక సన్నివేశాలను శంకర్ చిత్రీకరిస్తున్నారు. మరో షెడ్యూల్ హైదరాబాదులో ఉంటుంది. దాంతో ఒక పాట ఫైట్ కీలక ఘట్టాల మినహా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి భారీ రేంజ్‌లో బిజినెస్ జరుగుతోంది. కోలీవుడ్ తో పాటు ఇండియా రేంజ్ లో రైట్స్ కోసం బయ్యర్లు క్యూ కడుతున్నారు. ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అన్ని భాషల ఓవర్సీస్ హక్కుల కోసం 45 కోట్లకు పైగానే చెల్లించడానికి ఓ ప్రముఖ ఓవర్సీస్ సంస్థ ముందుకు వచ్చిందట. ఇక నాన్ థియేటికల్ రైట్స్ కింద ప్రముఖ ఓటీటీ సంస్థ 200 కోట్లకు తమ అంగీకారం తెలిపిందని సమాచారం. మొత్తం గా చూసుకుంటే విడుదలకు ముందే ఈ చిత్రం 600 కోట్ల బిజినెస్ చేసిన ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి...!
![]() |
![]() |