![]() |
![]() |

ఫిదాతో తెలుగ చిత్ర సీమలో తొలి అడుగేసింది సాయిపల్లవి. ఆ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సహజంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనే పలకరించే ఈ అభినయ తార.. ఇప్పుడు క్రమంగా అగ్ర కథానాయకుల చిత్రాల్లోనూ భాగమయ్యే దిశగా అడుగులేస్తోందని ఫిల్మ్ నగర్ ఇన్ ఫర్మేషన్. ఇప్పటికే అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సాయిపల్లవి నటించబోతున్నట్లు విశ్వసనీయ కథనాలు వచ్చేశాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు మరో బిగ్ టికెట్ ఫిల్మ్ లోనూ ఈ ఫిదా పోరి నటించబోతోందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సలార్ పేరుతో ఓ యాక్షన్ సాగాని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ముగ్గురు నాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ఓ రోల్ లో సాయిపల్లవిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బజ్. త్వరలోనే సాయిపల్లవి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మరి.. ఇప్పటివరకు పాన్ ఇండియా మూవీస్ లో నటించిన అనుభవం లేని సాయిపల్లవికి ఈ సినిమా ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
![]() |
![]() |