![]() |
![]() |

తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైపోయిన కోలీవుడ్ స్టార్ కార్తి.. ఇక్కడివారిని ఇప్పుడిప్పుడే ఇంప్రెస్ చేస్తున్న కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ ఒకే రోజు తమ తమ కొత్త చిత్రాలతో బరిలోకి దిగుతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. `కొంబన్` (2015) చిత్రం తరువాత ముత్తయ్య దర్శకత్వంలో కార్తి నటిస్తున్న సినిమా `విరుమన్`. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఆగస్టు 31న వినాయక చవితి కానుకగా విడుదల కానుంది. కట్ చేస్తే.. అదే రోజున `జాతి రత్నాలు` ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తున్న పేరు నిర్ణయించని బైలింగ్వల్ మూవీ (#SK20 - తెలుగు, తమిళ్ ) కూడా విడుదలకు సిద్ధమైంది. మరి.. వేర్వేరు నేపథ్యాలతో తెరకెక్కుతున్న సినిమాలతో వినాయక చవితి బరిలో దిగుతున్న కోలీవుడ్ స్టార్స్ కార్తి, శివ కార్తికేయన్.. ఆయా చిత్రాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
కాగా, కార్తి `విరుమన్`కి స్టార్ కంపోజర్ యువన్ శంకర్ రాజా బాణీలు అందిస్తుండగా.. శివ కార్తికేయన్ - అనుదీప్ కేవీ కాంబో మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు.
![]() |
![]() |