![]() |

ఒక సినిమా హిట్ అవ్వడానికి ముఖ్యంగా కావాల్సింది కథ.. ఆ కథ తర్వాతనే హీరో, హీరోయిన్, దర్శకుడుతో పాటు ఇతర టెక్నీషియన్స్. ఆ అందరి పని తనం సినిమా విజయంలో కీ రోల్ పోషిస్తుంది. కానీ సినిమాకి అసలైన లివర్ మాత్రం 'కథ' మాత్రమే. కథ సరిగ్గా లేకపోతే కోట్లాది రూపాయల బడ్జెట్ పెట్టినా, భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది – "కథే నాయకుడు, కథే కథానాయకుడు" అని! ఈ నేపథ్యంలో కథ యొక్క గొప్పతనానికి సంబంధించిన న్యూస్ ఒకటి సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
ప్రముఖ దర్శకుల దగ్గర రచయితగా చేసిన రైటర్ ఒకాయన నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని ఒక కథ తయారు చేసాడు. ఆ కథని టాప్ ప్రొడ్యూసర్ ల దగ్గరనుంచి, చిన్న ప్రొడ్యూసర్ ల వరకు అందరికి వినిపించాడు. అందరూ వినగానే మైమరచిపోయి లక్ష దగ్గర నుంచి ఐదు లక్షల దాకా అడ్వాన్స్ ఇచ్చారు. కానీ కథ మాత్రం ఇంతవరకు సినిమాగా తెరకెక్కలేదు. దాంతో ఆ రైటర్ తెరకెక్కని ఆ కథ వల్ల ముప్పై లక్షల వరకు సంపాదించాడు. సినీ రూల్స్ ప్రకారం అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ లో తెరకెక్కించకపోతే అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇవ్వరు.
Also read: Chiranjeevi: సెంటిమెంట్ నిజమైందా! అభిమానుల కన్నీళ్లు
ఆ రైటర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో తెలుగు వాడి సత్తా చాటుతున్న టాప్ దర్శకుడి తొలి సినిమాకి కథని అందించాడు. ఆ చిత్రంలోని హీరో కూడా పాన్ ఇండియా కట్ అవుట్ . ప్రస్తుతం ఆ రైటర్ తన భార్య పేరుతో సీరియల్స్ కి పని చేసుకుంటున్నాడు.
cinema, story, director, hero
![]() |