![]() |

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)కి తెలుగునాట కూడా మంచి గుర్తింపు ఉంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ప్రస్తుతం తెలుగులో 'ఆకాశంలో ఒక తార'తో పాటు ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక ఫిల్మ్ చేయడానికి దుల్కర్ సల్మాన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు.
ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది.. రెండో సినిమాకే రామ్ చరణ్ తో 'రచ్చ' చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటీమార్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దుల్కర్ ని డైరెక్ట్ చేయనున్నాడట.
ఇప్పటికే దుల్కర్ సల్మాన్, సంపత్ నంది మధ్య కథా చర్చలు జరిగాయని.. సంపత్ చెప్పిన స్టోరీ లైన్ కి దుల్కర్ ఇంప్రెస్ అయ్యాడని వినికిడి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
![]() |