![]() |
![]() |

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. త్వరలో ఈ అద్భుతాన్ని చూసే అవకాశం అభిమానులకు కలగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్'(Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Also Read: టెంపర్ బ్యూటీకి రోడ్డు ప్రమాదం.. మద్యం మత్తులో..!
డ్రాగన్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. టోవినో థామస్, బిజు మీనన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అతిథి పాత్ర కోసం రజనీకాంత్ రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. (NTR Neel)
డ్రాగన్ లో కథకి కీలకమైన ఒక స్పెషల్ రోల్ లో రజనీకాంత్ నటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మూవీ టీమ్ ఆయనను సంప్రదించిందట. రజనీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఎన్టీఆర్ సినిమాలో రజనీని చూడొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
![]() |
![]() |