![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ మహారాజా రవితేజ.. ఇలా ఇప్పటికే పలువురు అగ్ర కథానాయకులతో సినిమాలు తీశారు స్టార్ కెప్టెన్ బోయపాటి శ్రీను. ఈ క్రమంలోనే.. త్వరలో మరో టాప్ స్టార్ తో ఆయన జట్టుకట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబుని సంప్రదించి ఓ ఆసక్తికరమైన స్టోరీ లైన్ చెప్పారట బోయపాటి. అది నచ్చడంతో మహేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. అంతేకాదు.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ కాంబో మూవీని నిర్మించనుందని, 2023 చివరలో ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందని టాక్. త్వరలోనే మహేశ్ - బోయపాటి ఫస్ట్ కాంబో వెంచర్ కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. మహేశ్ - బోయపాటి కాంబినేషన్ బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
కాగా, మహేశ్ తాజా చిత్రం `సర్కారు వారి పాట` మే 12న విడుదల కానుంది. ఆపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ, దర్శకధీరుడు రాజమౌళితోనూ మహేశ్ తదుపరి చిత్రాలు రాబోతున్నాయి. ఇక బోయపాటి విషయానికి వస్తే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో ఓ పాన్ - ఇండియా మూవీ చేయబోతున్నారు. సో.. ఈ కమిట్మెంట్స్ అయ్యాకే మహేశ్ - బోయపాటి కాంబో సాధ్యపడే అవకాశముందంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో!
![]() |
![]() |