![]() |
![]() |
పూజా హెగ్డే.. ఈతరం కుర్రకారు గుండె చప్పుడు. కెరీర్ ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసిన ఈ స్టన్నింగ్ బ్యూటీ.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు వరుస విజయాలతో వార్తల్లో నిలుస్తోంది పూజ. `అరవింద సమేత`, `మహర్షి`, `గద్దలకొండ గణేష్`, `అల వైకుంఠపురములో`, తాజాగా విడుదలైన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`.. ఇలా ఐదు వరుస విజయాలను సొంతం చేసుకుని తెలుగునాట సంచలనం సృష్టించింది మిస్ హెగ్డే.
ఈ నేపథ్యంలో.. పూజ తదుపరి చిత్రం `రాధే శ్యామ్`పై ఎనలేని ఆసక్తి నెలకొంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి పూజ నటించిన ఈ పాన్ - ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇందులో ప్రేరణ అనే యువతి పాత్రలో దర్శనమివ్వనుంది పూజ. మరి.. `రాధే శ్యామ్`తో డబుల్ హ్యాట్రిక్ పై కన్నేసిన పూజా హెగ్డే.. ఆ ఫీట్ ని సొంతం చేసుకుంటుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `జిల్` రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన `రాధే శ్యామ్` ప్రభాస్ కి నాలుగో పాన్ - ఇండియా ప్రాజెక్ట్ కాగా.. పూజకి తొలి పాన్ - ఇండియా మూవీ. పునర్జన్మల నేపథ్యంలో ఈ పిరియడ్ లవ్ సాగా సాగుతుందని బజ్.
![]() |
![]() |