![]() |
![]() |
`సాహో`లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తో రొమాన్స్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం `ఆదిపురుష్`లో కృతి సనన్, `ప్రాజెక్ట్ కే`లో దీపికా పదుకోణ్ తో జట్టుకట్టాడు. అంతేకాదు.. తన 25వ చిత్రం కోసం కూడా అదే బాట పట్టనున్నాడట.
ఆ వివరాల్లోకి వెళితే.. `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` పేరుతో ప్రభాస్ తన సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ దివా కరీనా కపూర్ నటించబోతోందట. అదే గనుక నిజమైతే.. పాన్ - వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ యే కరీనాకి తెలుగులో తొలి చిత్రమవుతుంది. త్వరలోనే `స్పిరిట్`లో కరీనా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. 41 ఏళ్ళ ప్రభాస్ తో 40 సంవత్సరాల కరీనా జోడీ కడితే ఎలా ఉంటుందో చూడాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`లో కరీనా భర్త, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. 2022 ఆగస్టు 11న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి రానుంది.
![]() |
![]() |