![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ 'ఎన్నై అరిందాల్'. 2015లో విడుదలైన ఈ సినిమా తమిళ్ లో ఘన విజయాన్ని అందుకుంది. 'ఎంతవాడుగానీ' పేరుతో విడుదలై తెలుగులోనూ మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారని, అందులో వెంకటేష్ హీరోగా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన ఇతర భాషా చిత్రాలను మళ్ళీ తెలుగులో రీమేక్ చేయడం ట్రెండ్ గా మారింది. గతంలో అజిత్ నటించిన తమిళ్ మూవీ 'వీరం'ను తెలుగులో 'వీరుడొక్కడే' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమాను 'కాటమరాయుడు' పేరుతో పవన్ కళ్యాణ్ మళ్ళీ తెలుగులో రీమేక్ చేశారు. ఇక మోహన్ లాల్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' ను తెలుగులోనూ అదే పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఆ సినిమాను చిరంజీవి హీరోగా 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక 'ఎన్నై అరిందాల్' మూవీ వంతు వచ్చింది.
'ఎన్నై అరిందాల్'ను కూడా మొదట చిరంజీవి రీమేక్ చేయనున్నారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు వెంకటేష్ పేరు తెర మీదకు వచ్చింది. ఈ మూవీ రీమేక్ రైట్స్ సురేష్ బాబు దగ్గర ఉన్నాయట. ఆయన ఈ సినిమాను వెంకటేష్ హీరోగా రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |