![]() |
![]() |

`జనతా గ్యారేజ్` (2016) వంటి సెన్సేషనల్ హిట్ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో విజనరీ డైరెక్టర్ కొరటాల శివ మరో సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ వెంచర్ సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. తారక్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న సినిమా ఓ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుందని.. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టు ఈ చిత్రానికి `డైమండ్` అనే పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. పాన్ - ఇండియా మూవీ కాబట్టి అన్ని ప్రాంతాలవారు కనెక్ట్ అయ్యేలా.. ఈ యూనివర్శల్ టైటిల్ ని ఫిక్స్ చేశారని వినికిడి. త్వరలోనే `డైమండ్` టైటిల్ కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. ఐదేళ్ళ తరువాత మరోసారి జట్టుకడుతున్న తారక్, శివ.. సెకండ్ జాయింట్ వెంచర్ తోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.
కాగా, తారక్ ఇటీవలే `ఆర్ ఆర్ ఆర్`ని పూర్తిచేశారు. ఇక కొరటాల విషయానికి వస్తే.. తన తాజా చిత్రం `ఆచార్య` చిత్రీకరణ తుది దశలో ఉంది.
![]() |
![]() |