![]() |

'కేజీఎఫ్' మూవీతో కన్నడ హీరో యశ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 'కేజీఎఫ్ చాప్టర్ 2' కోసం కన్నడ ప్రేక్షకులు ఎంతలా ఎదురుచుస్తున్నారో.. తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'కేజీఎఫ్'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యశ్.. ఇప్పుడు ఓ టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది.
తెలుగులో మాస్ సినిమాల దర్శకుడిగా బోయపాటి శ్రీనుకు మంచి పేరుంది. భద్ర, తులసి, సింహా, లెజెండ్, సరైనోడు లాంటి కమర్షియల్ హిట్స్ ను అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ మాస్ డైరెక్టర్.. కన్నడ హీరో యశ్ తో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథ కూడా ఓకే అయిందని.. కేజీఎఫ్ తరహాలో ఇది కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. యశ్ - బోయపాటి కాంబినేషన్ లో కమర్షియల్ మూవీ పడితే మాస్ ఆడియన్స్ కి పండగే అని చెప్పొచ్చు.
బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో 'అఖండ' మూవీ చేస్తున్నాడు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత బోయపాటి-బాలయ్య కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'అఖండ'పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే బోయపాటి.. యశ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడని అంటున్నారు.
![]() |