![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ నటుడిగా తిరుగులేని స్టార్‌డమ్ చూశారు. అలాగే దర్శకుడిగానూ తనదైన ముద్రవేశారు. ఎడిటర్ గానూ మెప్పించారు. అంతేకాదు.. పద్మాలయ స్టూడియోస్ పతాకంపై తన సోదరులు జి. హనుమంతరావు, జి. ఆదిశేషగిరి రావుతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. వీటిలో రీమేక్స్ కే ఎక్కువ స్కోప్ ఇచ్చారు.
కట్ చేస్తే.. 50 ఏళ్ళ ఘన చరిత్ర ఉన్న పద్మాలయా స్టూడియోస్ స్వల్ప విరామం అనంతరం మళ్ళీ నిర్మాణ రంగంలోకి రాబోతోంది. ఇందులో భాగంగా.. హిందీలో రెండు రీమేక్ మూవీస్ ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. విశేషమేమిటంటే.. ఈ రెండు రీమేక్స్‌ని కూడా బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబినేషన్ లో చేయాలని సూపర్ స్టార్ కృష్ణ ప్లాన్ చేస్తున్నారు.
అందులో ఒకటి.. 'ప్రేమకథా చిత్రమ్' (సుధీర్ బాబు) రీమేక్ కాగా.. మరొకటి 'పాతాళ భైరవి' రీమేక్. నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో మేలిమలుపు చిత్రమైన 'పాతాళ భైరవి'ని జితేంద్ర హీరోగా 'పాతాళ్ భైరవి' పేరుతో గతంలో ఓసారి రీమేక్ చేసింది పద్మాలయా స్టూడియోస్. ఇప్పుడదే సినిమాని జితేంద్ర కుమార్తె, ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ తో కలిసి హృతిక్ హీరోగా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మొత్తమ్మీద.. పద్మాలయా స్టూడియోస్ సంస్థ మరోమారు బాలీవుడ్ లో తనదైన ముద్రవేయబోతోందన్నమాట. మరి.. ఈ రీమేక్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.
![]() |
![]() |