మన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న వెబ్ సిరీస్ 'నవరస'. టైటిల్‌కి తగ్గట్టు 9 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో దర్శకుడు. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో హీరో. ప్రతి ఎపిసోడ్ డిఫరెంట్‌గా, డిఫరెంట్ జానర్లో... తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల ప్రేక్షకులు చూసేవిధంగా ప్లాన్ చేశారట. అందుకని, అన్ని భాషలకు చెందిన హీరోలను తీసుకోవాలనేది మణిరత్నం ఆలోచన. అందులో భాగంగా తెలుగు హీరోలకు ఆయన ఫోన్లు చేస్తున్నారట.
మణిరత్నం కనుక తమిళ హీరోలు మాధవన్, సిద్ధార్థ్ సంతోషంగా వెబ్ సిరీస్ చేయడానికి అంగీకరించారు. వాళ్ళిద్దరికీ లైఫ్ ఇచ్చినది ఆయనే కాబట్టి సమస్య లేదు. సూర్యతో డిస్కషన్స్ చేస్తున్నారు. తెలుగు నుండి హీరోలను ఎవరిని తీసుకోవాలనేది మణిరత్నం ముందున్న సవాల్. పెద్ద హీరోలు ఎవరూ వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అలాగని, మరీ చిన్న హీరోలను తీసుకుంటే క్రేజ్ రాదు. యంగ్ హీరోలలో మంచి ఫేమ్, నేమ్ ఉన్నవాళ్ళను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. నాని, నాగచైతన్య, 'ఆర్ఎక్స్ 100' కార్తికేయ, విజయ్ దేవరకొండ తదితరుల పేర్లు మణిరత్నం అండ్ కో పరిశీలనలో ఉన్నాయట.