![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. `అతడు`, `ఖలేజా` చిత్రాల అనంతరం వీరి కలయికలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో మహేశ్ కి జోడీగా పూజా హెగ్డే నటించనుండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని 2022 సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఏప్రిల్ 22న ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే గనుక నిజమైతే.. అటు మహేశ్, ఇటు త్రివిక్రమ్ లక్కీ మంత్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లే. గతంలో ఏప్రిల్ నెల వేదికగా `పోకిరి`, `భరత్ అనే నేను` వంటి విజయాలను మహేశ్ అందుకోగా.. `జల్సా`, `సన్ ఆఫ్ సత్యమూర్తి` వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకున్నారు త్రివిక్రమ్. మరి.. రాబోయే చిత్రంతోనూ ఈ ఇద్దరు ఏప్రిల్ సెంటిమెంట్ ని కొనసాగిస్తారేమో చూడాలి.
![]() |
![]() |