![]() |
![]() |

ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి భారతీయుడి నోటి నుంచి వినిపిస్తున్న పదం 'ఆపరేషన్ సింధూర్'(Operation Sindoor). ఏ ముహూర్తాన భారత ప్రభుత్వం పాకిస్థాన్ ఉగ్రవాదులని మట్టుబెట్టడానికి 'ఆపరేషన్ సింధూర్ 'పేరుని ఫిక్స్ చేసిందో గాని, ఆ పోరులో విజయాన్ని సాధించడమే కాకుండా ప్రతి భారతీయుడు సగర్వంతో తలెత్తుకునేలా చేసారు.
ఇప్పుడు ఈ 'ఆపరేషన్ సింధూర్' టైటిల్ కోసం బాలీవుడ్ కి చెందిన పదిహేను చిత్ర నిర్మాణ సంస్థలు 'ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(Indian Motion Pictures Association)లో దరఖాస్తు చేసాయి. టి సిరీస్, జీ స్టూడియో వంటి అగ్ర నిర్మాణ సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్న లిస్ట్ లో ఉన్నాయి. ఈ పరిణామాలపై దరఖాస్తు చేసుకున్న నిర్మాతల్లో ఒకరైన అశోక్ పండిట్ మాట్లాడుతు ఆపరేషన్ సింధూర్ పై సినిమా తెరకెక్కుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. కాకపోతే అందర్నీ ఆకట్టుకునే టైటిల్ తమ సినిమాకి పెట్టుకోవాలని ప్రతి నిర్మాత భావిస్తుంటాడు. టైటిల్ అనుకోకుండా ఏ సినిమాని ప్లాన్ చెయ్యలేం. తాజా పరిమాణాల నేపథ్యంలో చాలా మంది 'ఆపరేషన్ సింధూర్' ని రిజిస్టర్ చేసారు. వాళ్లంతా సినిమా తెరకెక్కిస్తారని చెప్పలేం. దేశం ఎలాంటి సవాళ్లు ఎదుర్కుంటుందో నాకు తెలుసు. ఒక బాధితుడుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను.పాకిస్థాన్ వాళ్ల ప్రత్యక్షంగా ఇబ్బంది పడ్డానని తెలిపాడు.
అశోక్ పండిట్(Ashok Pandit)ప్రస్తుతం ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్(Indian Motion Pictures Association)కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, ది ఛార్జ్ షీట్, 72 హూరైన్ వంటి పలు చిత్రాలు ఆయన నిర్మాణ సారధ్యంలో వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ టైటిల్ కోసం దరఖాస్తు చేసిన మొదటి సంస్థ మహావీర్ జైన్ ఫిల్మ్స్.

![]() |
![]() |