![]() |
![]() |

'పహల్ గామ్'(Pahal Gam)లో మారణహోమాన్ని సృష్టించిన పాకిస్థాన్ తీవ్రవాదులని ఆపరేషన్ సింధూర్'(Operation sindoor)తో మన భారత సైన్యం తుద ముట్టించింది. దీంతో భారతీయులు సంబరాల్లో మునిగిపోయారు. పలువురు సినీ ప్రముఖులు సైతం 'ఆపరేషన్ సింధూర్' విజయవంతమైనందుకు ప్రధాని మోదీ(Modi)ఇండియన్ ఆర్మీ(Indian Army)ని అభినందిస్తు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. కానీ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన పాకిస్థాన్ యాక్టర్స్ ఫవాద్ ఖాన్(Fawad Khan)మహీరా ఖాన్(Mahira Khan) మాత్రం భారత సైన్యం చేసిన దాడిని పిరికి పందచర్యగా అభివర్ణిస్తు విమర్శనాస్త్రాలు గుప్పించారు.
ఇప్పుడు ఈ విషయంపై 'ఆల్ ఇండియా సినీవర్కర్స్ అసోసియేషన్ స్పందిస్తు 'ఆపరేషన్ సింధూర్'పై ఫవాద్, మహీరా చేసిన కామెంట్స్ ఉగ్రవాదుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారితో పాటు సైనికుల్ని దేశాన్ని అగౌరవపరిచే విధంగా ఉన్నాయి. భారతీయులెవరు వీరిని నమ్మవద్దు. కళ పేరుతో ఇలాంటి కళాకారులకి గుడ్డిగా మద్దతు ఇవ్వడమంటే, దేశ గౌరవాన్ని అవమానించడమే. సినిమా వాళ్ళు ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకోవాలి. గాయని గాయకులు కూడా పాక్ సింగర్స్ తో ఎక్కడ కూడా వేదికని పంచుకోవద్దు. మన దగ్గర వర్క్ చేసే పాకిస్థానీ కళాకారులు, నిర్మాతలని చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని అసోసియేషన్ కోరింది.
'షారుఖ్ ఖాన్'(Shah Rukh Khan)హీరోగా వచ్చిన 'రాయిస్' తో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా మహీరా అడుగుపెట్టింది. ఇక ఫవాద్ 2014 లో వచ్చిన 'ఖుబ్సురత్ ' తో హిందీ చిత్ర రంగంలోకి అడుగుపెట్టాడు. కపూర్ అండ్ సన్స్, ఏ దిల్ హై ముష్కి, అబీర్ గులాల్ అనే పలు చిత్రాలు చేసాడు. మే 9 న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా పహల్ గామ్ అటాక్ నేపథ్యంలో వాయిదా పడింది. కానీ ఆపరేషన్ సింధూర్ ని ఫవాద్ ఖండించడంతో సినిమా రిలీజ్ కష్టమనే టాక్ ముంబై సినీ వర్గాల్లో వినపడుతుంది. కొన్ని సినిమాల్లో కామియో అప్పీరియన్స్ కూడా ఇచ్చిన ఫవాద్ పలు వెబ్ సిరీస్ లో కూడా చేసాడు.
![]() |
![]() |