
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నిర్మాత దిల్ రాజుకు ఇప్పుడు ఆ అవకాశం రాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'వకీల్ సాబ్' మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోందనే వార్త ఫిలింనగర్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఈసారి ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు 'అర్జున' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్‌తో చేయబోయే సినిమా కోసం దిల్ రాజు 'అర్జున' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది. మహాభారతంలోని అర్జునుడి పాత్రను గుర్తు చేసేలా ఈ టైటిల్ ఉండటంతో.. పవన్ ఇమేజ్‌కు బాగా సరిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇందులో పవన్ ఒక బలమైన లక్ష్యంతో పోరాడే యోధుడి తరహా పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే అవకాశముందని వినికిడి. ప్రస్తుతం దిల్ రాజు.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమా పనులు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండటంతో ఆయన అందుబాటులో ఉండే షెడ్యూల్స్‌ను బట్టి ఈ సినిమా కార్యాచరణ ముందుకు వెళ్లే అవకాశం ఉందని టాక్.
ఇది కూడా చదవండి: ఫౌజీ సెట్స్‌లోకి ప్రభాస్ రీఎంట్రీ.. క్లైమాక్స్ కోసం హను రాఘవపూడి భారీ ప్లాన్.!

[Pawan Kalyan Pan India Movie, Arjuna Movie, Pawan Kalyan Dil Raju Movie, Pawan Kalyan Vamshi Paidipally, Pawan Kalyan, Dil Raju, Vamshi Paidipally, Telugu Film News]





