Home

»

Gossips

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ: హీరోయిన్‌గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ.!

Nov 1, 2026 4:11PM

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇటీవల మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై అధికారిక ప్రకటన రావడంతో నందమూరి అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. 

అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడానీని మోక్షజ్ఞకు జోడీగా ఎంపిక చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

రాషా తడానీ బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాలపైనా దృష్టి పెట్టారు. ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేనితో కలిసి 'శ్రీనివాస మంగాపురం' సినిమాలో నటించారు. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా కోసం కూడా రాషా పేరు వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

నిజానికి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ మొదట హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అనౌన్స్ అయ్యి ఆగిపోయింది. ఆ సమయంలో కూడా హీరోయిన్‌గా రాషా తడానీ పేరు వినిపించడం విశేషం.

ఇక మోక్షజ్ఞ-వశిష్ట సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన గాసిప్ కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని టాక్. బాలకృష్ణ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణతో కలిసి ఆమె సన్నివేశాలు ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: అర్జున.. పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భారీ పాన్ ఇండియా మూవీ.!

 

 

 

[Mokshagna Debut Movie Heroine, Raveena Tandon Daughter, Rasha Thadani, Nandamuri Mokshagna, Nandamuri Balakrishna, Mallidi Vassishta, Kajol, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com